ISRO: చరిత్ర సృష్టించేందుకు సిద్దమైన ఇస్రో! 8 d ago
ఇస్రో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుడుతోంది.స్పేస్ డాకింగ్ ఎక్స్‌పెరిమెంట్ (SpaDeX)ద్వారా ఛేజర్ (SDX01) మరియు టార్గెట్ (SDX02)అనే రెండు శాటిలైట్లు కక్ష్యలో ప్రవేశపెట్టబడతాయి. ఈ ప్రయోగంలో ఛేజర్ శాటిలైట్ టార్గెట్ శాటిలైట్‌కు ప్రత్యేకమైన డాకింగ్ పరికరంతో కనెక్ట్ కావాలి. ఈ క్లిష్టమైన ప్రక్రియ విజయవంతమైతే, ఇస్రో అంతరిక్ష సాంకేతికతలో కీలక మైలురాయిని చేరుతుంది. ఈ డాకింగ్ ప్రయోగం అంతర్జాతీయ స్థాయి వ్యోమసాంకేతికతలో భారతదేశ స్థాయిని మరింత పెంచుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.